Mohammad Kaif: టీమిండియా మేనేజ్‌మెంట్‌పై బాంబు పేల్చిన కైఫ్.. 2003 ప్రపంచకప్ ఫైనల్‌పై సంచలన వ్యాఖ్యలు

  • స్లోపిచ్ తయారుచేయించి పీకలమీదకు తెచ్చుకున్నారన్న కైఫ్
  • మూడు రోజుల్లోనే పిచ్ రంగు మారడాన్ని తాను గమనించానన్న మాజీ ప్లేయర్
  • చెన్నై మ్యాచ్‌లో గమనించాకే కమిన్స్ ఫైనల్‌లో ఫీల్డింగ్ ఎంచుకున్నాడన్న కైఫ్
Mohammad Kaif Blasting Comments On 2023 World Cup Final

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, కోచ్ రాహుల్ ద్రవిడ్, జట్టు మేనేజ్‌మెంట్‌పై మాజీ కెప్టెన్ మహ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2003 ప్రపంచకప్ ఫైనల్‌కు స్లో పిచ్ కావాలని భారత జట్టు అడిగిందని, ఫైనల్‌లో ఓటమికి అదే కారణమైందని పేర్కొన్నాడు. నరేంద్రమోదీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఓటమి పాలైంది. అప్పుడు హిందీ కామెంటరీ బాక్స్‌లో కైఫ్ సభ్యుడు. అప్పుడు తాను అక్కడే ఉన్నానని, పిచ్ మూడు రోజుల్లోనే రంగు మారడాన్ని తాను చూశానని చెప్పుకొచ్చాడు. అదే భారత్‌ను దెబ్బకొట్టిందని చెప్పాడు. ఫైనల్‌లో భారత జట్టు 240 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 47 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినప్పటికీ ట్రావిస్ హెడ్ చెలరేగడంతో భారత్ చేయగలిగిందేమీ లేకపోయింది.

‘‘పిచ్‌ పరిశీలనకు సాయంత్రం పూట రోహిత్, ద్రవిడ్ వచ్చారు. మూడు రోజులు గంటపాటు పిచ్ వెనక నిలబడి పరిశీలించారు. ఆ మూడు రోజుల్లో పిచ్ రంగు మారడం నేను గమనించాను. వారికి (ఆస్ట్రేలియా) ఫాస్ట్ బౌలర్లు కమిన్స్, స్టార్క్ ఉన్నారు కాబట్టి స్లో పిచ్‌లు ఇవ్వాలని అనుకున్నారు. నిజానికి ఇక్కడే వారు తడబడ్డారు. క్యురేటర్ పిచ్‌ను తయారుచేస్తాడని జనం అనుకుంటారు. కానీ, ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడరు. నిజం మాత్రం ఇదే. నిజానికి ప్రజలు కూడా ఇది నమ్మడానికి సిద్దంగా ఉండరు’’ అని కైఫ్ పేర్కొన్నాడు.

పిచ్ ఎలా ఉండాలనే విషయంలో ఆతిథ్య దేశానికి అన్ని హక్కులు ఉంటాయని కైఫ్ పేర్కొన్నాడు. ఫైనల్‌లో ఆస్ట్రేలియా గెలుపులో కమిన్స్‌దే కీలక పాత్ర అని భారత జట్టు పొగిడిందని, కానీ అసలు విషయం మాత్రం ఇదని కైఫ్ చెప్పుకొచ్చాడు. స్లో పిచ్‌పై తొలుత బ్యాటింగ్ కఠినంగా ఉంటుందని కమిన్స్ చెన్నై మ్యాచ్‌లో గ్రహించాడని పేర్కొన్నాడు. నిజానికి ఫైనల్‌లో ఎవరూ తొలుత ఫీల్డింగ్ చేయరని, కానీ కమిన్స్ అలా చేసి జట్టుకు విజయాన్ని అందించి పెట్టాడని ప్రశంసించాడు.

More Telugu News