ఘనంగా నిఖిల్ కుమారుడి బారసాల.. ముఖం చూపించకుండా జాగ్రత్తలు
- ఫిబ్రవరి 21న మగబిడ్డకు జన్మనిచ్చిన పల్లవి
- బారసాల ఫొటోలను షేర్ చేసిన పల్లవి
- ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్న నిఖిల్
ఫిబ్రవరి 21న హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పల్లవి మగబిడ్డకు జన్మనిచ్చారు. బారసాల ఫోటోలను షేర్ చేసిన పల్లవి కుమారుడి ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. నిఖిల్ ప్రస్తుతం స్వయంభు అనే భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీతోపాటు రాంచరణ్ నిర్మాణంలో ఇండియా హౌస్ అనే సినిమాలోనూ నిఖిల్ నటిస్తున్నాడు.