నేను గెలవకపోతే రక్తపాతమే.. డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
- నవంబర్ 5వ తేదీ అమెరికా చరిత్రలో ముఖ్యమైనదిగా మారుతుందన్న మాజీ అధ్యక్షుడు
- తన ప్రత్యర్థి జో బైడెన్ ‘చెత్త’ అని విమర్శించిన రిపబ్లికన్ నేత
- మెక్సికోలో కార్లు తయారు చేసి అమెరికన్లకు విక్రయించాలనుకుంటున్న చైనా ఆటలను సాగనివ్వనన్న ట్రంప్
మెక్సికోలో కార్లను తయారు చేసి వాటిని అమెరికన్లకు విక్రయించాలనుకుంటున్న చైనా ప్రణాళికలకు తాను చెక్ పెడతానని, అధ్యక్షుడిగా ఎన్నికైతే చైనా కార్లను ఇక్కడ విక్రయించబోనివ్వనని అన్నారు. ఎన్నికల్లో తాను గెలవకపోతే రక్తపాతం అవుతుందని, అయినప్పటికీ చైనా కార్లను అమెరికాలో అమ్మనివ్వనని అన్నారు. కాగా రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ దాదాపు ఖరారయ్యారు. కీలక రాష్ట్రాల్లో ప్రైమరీ ఎన్నికల్లో గెలుపుతో నామినీగా ఆయనకు మార్గం సుగమమైంది.