Samantha: అందుకే నా వ్యాధి గురించి బయటపెట్టా: సమంత

samantha on reason behind revealing her health problem myositis
షార్ట్స్‌లో చూడండి
నటన నుంచి కాస్తంత విరామం తీసుకున్న హీరోయిన్ సమంత మళ్లీ రీఎంట్రీకి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పలు వేదికలపై ఇంటర్వ్యూలు ఇస్తూ అభిమానులకు మళ్లీ చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. 

తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ వేడుకలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘నేను 10 రకాలు పనులు చేస్తాను. ఐదు గంటల పాటు మాత్రమే నిద్రపోతాను. నా కెరీర్‌లో కొన్ని బాధపడిన సంవత్సరాలు ఉన్నాయి. దాని వల్ల సినీ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్న క్షణాలను ఆస్వాదించలేకపోయా. సక్సెస్ సాధించినప్పటికీ అది నా వల్ల వచ్చింది కాదనే భ్రమలో ఉండేదాన్ని. నటిగా దాదాపు 14 ఏళ్లు పూర్తి చేసుకున్నాను. అయితే, నేను లేడీ ఓరియెంటెడ్‌గా నటించిన యశోద సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనలేకపోయాను.

ఈ క్రమంలో చాలా రూమర్స్ వచ్చాయి. అవన్నీ తట్టుకోలేకపోయా. తప్పనిసరి పరిస్థితుల్లో నా వ్యాధి గురించి బయటపెట్టక తప్పలేదు. అంతేకానీ మరేమీ లేదు. అలాగే యశోద సినిమా తరువాత నువ్వు ప్రయోషన్స్ చేయకపోతే సినిమా ఫ్లాప్ అవుతుందని అనడంతో ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చాను. ఆ తరువాత ట్రీట్‌మెంట్‌ కోసం ఇంట్లోనే ఉండిపోయాను’’ అని వివరించింది.
Go Back to Shorts
Samantha
Tollywood

More Telugu News