సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ పసునూరి దయాకర్
- సచివాలయంలో మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిసిన బీఆర్ఎస్ ఎంపీ
- వరంగల్ లోక్ సభ సీటు విషయంలో అసంతృప్తితో ఉన్న పసునూరి దయాకర్
- త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి వరంగల్ ఎంపీ?
వరంగల్ లోక్ సభ సీటు కేటాయింపు విషయంలో పసునూరి దయాకర్ అధినేత కేసీఆర్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దయాకర్ వరంగల్ నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మొదటిసారి 2015 లోక్ సభ ఉప ఎన్నికల్లో, ఆ తర్వాత 2019లో మరోసారి విజయం సాధించారు. కానీ వరంగల్ సీటును ఈసారి కడియం కావ్యకు కేటాయించడంపై దయాకర్ అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన రేవంత్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.