ఇలాంటి యాక్సిడెంట్ ప్రపంచంలో ఎక్కడా చూసి ఉండరు.. కావాలంటే వీడియో చూడండి!

Women Can Do Anything Watch This Viral Video
  • ఇద్దరు అమ్మాయిలు స్కూటర్‌తో ఇంటిపైకి దూసుకెళ్లిన వైనం
  • ఇండోనేషియాలో ఘటన
  • సోషల్ మీడియాలో సెటైర్ల హోరు
ప్రపంచంలో అప్పుడప్పుడు నమ్మశక్యం కాని విషయాలు జరుగుతూ ఉంటాయి కదా.. అలాంటి వాటిలో ఇదొకటి. ఈ వీడియో చూశాక మీ కళ్లను మీరు కాసేపు నమ్మలేరంటే అతిశయోక్తి కాదు. ఇండోనేషియాలో జరిగిందీ ఘటన. ఓ యువతి స్కూటర్‌పై మరో యువతిని ఎక్కించుకుని వేగంగా వెళ్తూ అదుపు తప్పి ఏకంగా ఓ ఇంటిపైకి ఎక్కేసింది. 

అది పెంకుటిల్లు కావడంతో పెంకులు చెల్లాచెదురై స్కూటర్, ఇద్దరమ్మాయిలు అక్కడ ఇరుక్కుపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలకెక్కి వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల సరదా కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. 'ఈ ప్రమాదం ఎలా జరిగిందో ఆలోచించండి. ఆమె ఒక మహిళ. మహిళలు ఏమైనా చేయగలరు..' అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.

మరో యూజర్ కామెంట్ చేస్తూ.. నాకు తెలిసి ఆ ఇల్లు రోడ్డు మధ్యలో ఉండి ఉంటుంది. లేదంటే సడెన్‌గా రోడ్డుపైకి వచ్చి ఉంటుంది. పోలీసులు ఇంత వరకు ఆ ఇంటి యజమానిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని సెటైరికల్‌గా ప్రశ్నించాడు. మహిళా డ్రైవర్ రోడ్డుపై కాలుపెడితే వాహనం ఆగిపోయేలా రోడ్డు నిర్మించాలని అవినాశ్ కుమార్ అనే యూజర్ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరాడు. ఇలా యూజర్లు కామెంట్లు, సెటైర్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
Go Back to Shorts
Viral Videos
Indonesia
Road Accident
Social Media

More Telugu News