Singareni Collieries Company: సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Notification released for Recruitment of 327 posts in Singareni
షార్ట్స్‌లో చూడండి
ప్రభుత్వరంగ బొగ్గు మైనింగ్ సంస్థ సింగరేణిలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏడు కేటగిరీల్లోని 327 పోస్టుల నియామకానికి సంస్థ దరఖాస్తులు ఆహ్వానించింది. మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఈ2 (ఈఅండ్‌ఎం) గ్రేడ్‌- 42, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఈ2 (సిస్టమ్స్‌) గ్రేడ్‌- 7 ఖాళీలు ఉన్నాయని తెలిపింది. వీటితో పాటు జూనియర్‌ మైనింగ్‌ ఇంజినీరు టీఅండ్‌ఎస్‌ గ్రేడ్‌ సీ- 100, అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రైనీ (మెకానికల్‌) టీఅండ్‌ఎస్‌ గ్రేడ్‌ సీ- 9, అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రైనీ (ఎలక్ట్రికల్‌) టీ అండ్‌ ఎస్‌ గ్రేడ్‌ సీ- 24, ఫిట్టర్‌ ట్రైనీ కేటగిరీ-1- 47, ఎలక్ట్రీషియన్‌ ట్రైనీ కేటగిరీ-1- 98 భర్తీ చేయనున్నట్టు వెల్లడించింది.

అభ్యర్థులు ఏప్రిల్‌ 15 నుంచి మే 4 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరించనునున్నట్టు సింగరేణి వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం సింగరేణి వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చునని సీఎండీ బలరాం సూచించారు.
Go Back to Shorts
Singareni Collieries Company
Singareni Recruitment
jobs
Job Notifications

More Telugu News