మమతా బెనర్జీని ఎవరైనా వెనుక నుంచి తోసేసి ఉండొచ్చు.. తీవ్ర గాయంపై వైద్యుల అనుమానం
- నెట్టివేయడం కారణంగా తీవ్ర గాయం అయ్యుండొచ్చని ఎస్ఎస్‌కేఎం హాస్పిటల్ వైద్యుల సందేహం
- చికిత్స అనంతరం హాస్పిటల్ నుంచి తన నివాసానికి వెళ్లిపోయిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి
- మరిన్ని వైద్య పరీక్షల కోసం నేడు మరోసారి హాస్పిటల్కు వెళ్లనున్న పశ్చిమ బెంగాల్ సీఎం
న్యూరోసర్జరీ, జనరల్ మెడిసిన్, కార్డియాలజీ విభాగాలకు చెందిన నిపుణులు చికిత్స అందించారని మణిమోయ్ బందోపాధ్యాయ వివరించారు. ఎలక్ట్రో కార్డియోగ్రామ్, సీటీ స్కాన్ వంటి పలు వైద్య పరీక్షలు నిర్వహించామని చెప్పారు. హాస్పిటల్‌లోనే ఉండాలని చెప్పినప్పటికీ ఇంటికి వెళ్లాలంటూ ఆమె పట్టుబట్టారని వివరించారు. కాగా మరిన్ని వైద్య పరీక్షల కోసం సీఎం మమతాబెనర్జీ శుక్రవారం మరోసారి ఆస్పత్రికి రావాల్సి ఉంటుందని అన్నారు. కాగా ప్రస్తుతం ఆమె తన నివాసంలో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని చెప్పారు.
కాగా సీఎం మమతాబెనర్జీ గురువారం రాత్రి తీవ్రంగా గాయపడ్డారు. ఇంట్లో కాలుజారి పడడంతో నుదుటిపై తీవ్రమైన గాయమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తృణమూల్ కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ షేర్ చేసిన విషయం తెలిసిందే.