ఇకపై హైదరాబాద్ విమోచన దినంగా సెప్టెంబర్ 17.. కేంద్రం గెజిట్ విడుదల
- దేశ స్వాతంత్ర్యానంతరం 13 నెలల పాటు హైదరాబాద్ రాష్ట్రంలో నిజామ్ పాలన సాగిందన్న కేంద్రం
- ఆపరేషన్ పోలోతో హైదరాబాద్ దేశంలో విలీనమైందని వెల్లడి
- అమరుల జ్ఞాపకార్థం హైదరాబాద్ విమోచన దినం నిర్వహిస్తున్నట్టు ప్రకటన
సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినంగా నిర్వహించాలని బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా మంగళవారం హైదరాబాద్‌లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. హైదరాబాద్ విమోచన దినం నిర్వహించనందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను విమర్శించారు.
గత రెండు సంవత్సరాలుగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ.. హైదరాబాద్ విమోచన దినం నిర్వహిస్తోంది. ఆ వేడుకల్లో పాల్గొన్న హోం మంత్రి అమిత్ షా జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పారామిలిటరీ దళాల కవాతును వీక్షించారు. అయితే, ఓటుబ్యాంకు రాజకీయాలు కోసం హైదరాబాద్ విమోచన దినం జరుపుకోకపోవడం విషాదమని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు. ఇక బీఆర్‌ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను నేషనల్ ఇంటిగ్రేషన్ డే నిర్వహించింది.