ఇలాంటి దుస్థితి వస్తుందని ఊహించలేదు.. కంటతడి పెట్టిస్తున్న పావలా శ్యామల వీడియో
- హీరోలందరితో నటించా.. తాజా ఇంటర్వ్యూలో శ్యామల ఆవేదన
- ఎన్నో హిట్ సినిమాల్లో ఉన్నా ఆర్థికంగా స్థిరపడలేదన్న నటి
- వీల్ చైర్ కు పరిమితమై, అనాథగా బతుకీడుస్తున్నట్లు వెల్లడి
అయితే, తన కష్టాలను చెప్పి మిమ్మల్ని బాధపెట్టాలని ఈ షోకు రాలేదని శ్యామల చెప్పారు. మళ్లీ మిమ్మల్ని (ప్రేక్షకులను) చూస్తానో లేదోనని, ఒకసారి అందరికీ కనిపించాలనే ఉద్దేశంతోనే వచ్చానని వివరించారు. మరోసారి మీ అభిమానం పొందాలనే ఇప్పుడిలా మీ ముందుకు వచ్చానని తెలిపారు. కాగా, ఇటీవలి కాలంలో పావలా శ్యామల దీనస్థితి గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో కనిపిస్తూనే ఉంది. కొంతకాలం క్రితం నటుడు కాదంబరి కిరణ్ 'మనం సైతం' ఫౌండేషన్ తరఫున శ్యామలకు రూ.25 వేల ఆర్థిక సాయం చేశారు. మెగస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్ సహా పలువురు అగ్ర హీరోలు కూడా గతంలో పావలా శ్యామలను ఆర్థికంగా ఆదుకున్నారు.