చంద్రబాబు ఇంటివద్ద హంగామా చేసిన కేఏ పాల్
- ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం ముందు కారును ఆపిన పాల్
- పాల్ రావాలి.. పాలన మారాలి అంటూ నినాదాలు
- చంద్రబాబు నుంచి ప్రజలు ఏమీ ఆశించడం లేదని వ్యాఖ్య
చంద్రబాబు నుంచి ప్రజలు కొత్తగా ఏమీ ఆశించడం లేదని పాల్ అన్నారు. ఇప్పటికే చంద్రబాబు పాలనను చూసిన ప్రజలు విసిగిపోయారని చెప్పారు. పవన్ కల్యాణ్ అధికారంలోకి రాకుండా చంద్రబాబు చేశారని విమర్శించారు. పాలన అంటే సినిమాలో డ్యాన్సులు చేయడం కాదని ఎద్దేవా చేశారు. కేంద్రలో అధికారంలో ఉన్న బీజేపీ పదేళ్లుగా ఏపీని మోసం చూస్తూనే ఉందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు బీజేపీకి బుద్ధి చెపుతారని అన్నారు. సినీ నటుడు, సీనియర్ లీడర్ బాబూ మోహన్ కూడా తమ పార్టీలో చేరారని... మరింత మంది కీలక నేతలు తమ పార్టీలో చేరాలని ఆయన కోరారు.