Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ 'కుమారి ఆంటీ' క్రేజ్ మాములుగా లేదుగా..!

Kumar Aunty Acted TV Serial Promo released
Advertisement
  • టీవీ షోస్ నుంచి ఏకంగా టీవీ సీరియ‌లో ద‌ర్శ‌నం
  • 'రాజేశ్వ‌రి విలాస్ కాఫీ క్ల‌బ్' అనే సీరియ‌ల్‌లో అతిథి పాత్రలో మెరిసిన కుమారి ఆంటీ
  • ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో విడుద‌ల‌
Advertisement
కుమారి ఆంటీ.. ఇప్పుడు ఈ పేరుకు ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. సోష‌ల్ మీడియా వేదిక‌గా అంతలా పాప్యుల‌ర్ అయ్యారామె. హైద‌రాబాద్‌లో ఒక‌చోట రోడ్డు ప‌క్క‌న ఫుడ్ బిజినెస్ చేసుకునే ఆమెను 'మీది మొత్తం థౌజెండ్ అయ్యింది.. రెండు లివ‌ర్లు ఎక్స్‌ట్రా' అనే ఈ ఒక్క డైలాగ్ రాత్రికి రాత్రే సోష‌ల్ మీడియా స్టార్‌గా మార్చేసింది. ఫేస్ బుక్‌, ట్విట్ట‌ర్, ఇన్‌స్టా ఇలా ఏ సామాజిక మాధ్య‌మంలో చూసినా ఆమె ఫుడ్ వీడియోసే క‌నిపించాయి. అలా ఒక్క దెబ్బ‌తో సోష‌ల్ మీడియాను త‌న‌వైపు తిప్పుకున్నారు. 

ఎంతలా అంటే.. ఒక‌ప్పుడు ఆమె ఫుడ్ సెంట‌ర్ వ‌ద్ద అంత‌గా జ‌నం ఉండేవారు కాదు. ఇప్పుడు ఆమె ఫుడ్ సెంట‌ర్ వ‌ద్ద ఏకంగా ట్రాఫిక్ జామ్ వ‌ర‌కు వెళ్లింది. దాంతో ఆమె ఫుడ్ సెంట‌ర్‌ను మూసేయాల‌ని ట్రాఫిక్ పోలీసులు చెప్పారు. ఆ త‌ర్వాత ఈ స‌మ‌స్య సీఎం దృష్టికి వెళ్ల‌డంతో ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇంకేముంది.. కుమారి ఆంటీ పాప్యులారిటీ మ‌రింత పెరిగిపోయింది. 

ఆ త‌ర్వాత టీవీ షోస్‌కు రావ‌డం మొద‌లైంది. ఇప్పుడు ఏకంగా టీవీ సీరియ‌ల్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. జీ తెలుగులో ప్ర‌సారం అవుతున్న 'రాజేశ్వ‌రి విలాస్ కాఫీ క్ల‌బ్' అనే డైలీ సీరియ‌ల్‌లో అతిథి పాత్రలో ఎంట్రీ ఇచ్చి ప్రేక్ష‌కుల‌కు స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. త్వ‌ర‌లో ప్ర‌సారంకానున్న ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో ఒక‌టి తాజాగా విడుద‌లైంది. దీనిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్లు స్పందిస్తున్నారు. 'మా కుమారి ఆంటీతో మాములుగా ఉండ‌దు మ‌రి', 'కుమారి ఆంటీనా మ‌జాకా', 'ఇదెక్క‌డి మాస్ క్రేజ్ రా మావా' అంటూ కామెంట్ చేస్తున్నారు.
Advertisement
Advertisement
Kumari Aunty
TV Serial
Food Business
Hyderabad
Social Media

More Telugu News