'విశ్వంభర'లో ఇటు సాధారణ కన్యగా .. అటు దేవకన్యగా త్రిష!
- షూటింగు దశలో 'విశ్వంభర'
- ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న త్రిష
- ద్విపాత్రాభినయం చేయనున్నట్టుగా టాక్
- జనవరి 10వ తేదీన సినిమా విడుదల
ఈ సినిమాలో 'త్రిష' భూలోకానికి చెందిన సాధారణమైన కన్యగాను, దేవలోకానికి చెందిన దేవకన్యగాను కనిపించనుందని అంటున్నారు. ఈ రెండు పాత్రలలోను త్రిష గ్లామర్ ప్రధానమైన ఆకర్షణగా నిలవనుందని చెబుతున్నారు. చిరంజీవి - త్రిష .. ఈ ఇద్దరి పాత్రలు ఇటు క్లాస్ గాను .. అటు మాస్ గాను కనిపిస్తాయని చెబుతున్నారు.
ఇటు భూలోకానికి .. అటు దేవలోకానికి సంబంధించిన పాటలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయని టాక్. ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. చిరంజీవికి చెల్లెళ్లుగా .. ఇతర దేవకన్యలుగా మరికొందరు హీరోయిన్స్ తెరపై కనిపించనున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా, జనవరి 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.