నీట్ దరఖాస్తుల గడువు పొడిగింపు... వివరాలు ఇవిగో!
- ఈ ఏడాది మే 5న నీట్ యూజీ పరీక్ష
- షెడ్యూల్ ప్రకారం మార్చి 9తో ముగిసిన గడువు
- వెల్లువెత్తుతున్న దరఖాస్తులు
- మార్చి 16 వరకు గడువు పొడిగించిన ఎన్ టీయే
దేశవ్యాప్తంగా నీట్ యూజీ పరీక్షను ఎన్ టీఏ మే 5న నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు exams.nta.ac.in వెబ్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని ఎన్ టీఏ సూచించింది. వాస్తవానికి ముందు షెడ్యూల్ లో పేర్కొన్న ప్రకారం నీట్ యూజీ పరీక్షకు దరఖాస్తుల గడువు మార్చి 9వ తేదీతో ముగిసింది. అయితే, దరఖాస్తులు వెల్లువెత్తడంతో మార్చి 16వ తేదీ రాత్రి 10.50 నిమిషాల వరకు గడువు పొడిగించింది.