Sudha Murthy: సుధామూర్తికి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్

AP CM Jagan congratulates Sudha Murthy
షార్ట్స్‌లో చూడండి
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అర్ధాంగి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను రాజ్యసభకు నామినేట్ చేశారు. దీనిపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. "అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే రాజ్యసభకు నామినేట్ కావడం పట్ల సుధామూర్తి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దాతృత్వంలోనూ, సామాజిక కార్యకర్తగానూ, వ్యాపారవేత్తగా, రచయితగా సుధామూర్తి సేవలు నిరుపమానం. ఆమె తన భవిష్యత్ కార్యక్రమాలలోనూ మరింత ఉన్నత శిఖరాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Sudha Murthy
Jagan
Rajya Sabha
Infosys

More Telugu News