K Kavitha: సోనియా, ప్రియాంక గాంధీలు పార్లమెంట్‌కు వెళితే... తెలంగాణ బిడ్డలు వంటింట్లో కూర్చోవాలా?: కవిత ఆగ్రహం

  • ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం చేస్తోన్న జీవో నెంబర్ 3ని రద్దు చేయాలని డిమాండ్
  • ఆడబిడ్డల ఉద్యోగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదని విమర్శ
  • అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఆందోళన చేసే పరిస్థితికి తీసుకు వచ్చారని ఆగ్రహం
BRS MLA Kavitha demand for cancellation of go number 3

ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ, ఆమె కూతురు ప్రియాంకగాంధీలు ఎన్నికల్లో పోటీ చేసి పార్లమెంట్‌కు వెళితే తెలంగాణ ఆడబిడ్డలు మాత్రం వంటింట్లో కూర్చోవాలా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం చేస్తోన్న జీవో నెంబర్ 3ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత జాగృతి ఆధ్వర్యంలో ఆమె ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద దీక్షకు దిగారు.

సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఆడబిడ్డల ఉద్యోగాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదని విమర్శించారు. ఉద్యోగాల్లో మహిళలకు అన్యాయం చేస్తోన్న ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఆందోళన చేసే పరిస్థితికి తీసుకు వచ్చారని మండిపడ్డారు. మహిళలకు న్యాయం జరిగే జీవో నెంబర్ 41ను వెంటనే అమలు చేయాలన్నారు.

More Telugu News