TS 10th Results: తెలంగాణ పదో తరగతి ఫలితాలు వచ్చేస్తున్నాయ్

  • రేపు ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాల విడుదల
  • పరీక్షలకు హాజరైన 5.08 లక్షల మంది విద్యార్థులు
  • ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్
Telangana 10th class results tomorrow

తెలంగాణలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు రేపు విడుదల కాబోతున్నాయి. టెన్త్ రిజల్ట్స్ ను రేపు విడుదల చేయడానికి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫలితాలు ఆన్ లైన్ లో విడుదల కాబోతున్నాయి. పదో తరగతి పరీక్షా ఫలితాలకు విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. దాదాపు 5.08 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో 2,50,433 మంది బాలికలు... 2,57,952 మంది బాలురు పరీక్షలకు హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్ 13 నాటికి పూర్తయింది. పదో తరగతి పరీక్షల ఫలితాలను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్ సైట్ https://results.bsetelangana.org లో చెక్ చేసుకోవచ్చు. 

More Telugu News