ఎర్ర సముద్రంలో మరో నౌకపై హౌతీ రెబల్స్ క్షిపణి దాడి.. తొలిసారి ముగ్గురు సిబ్బంది మృతి
- బార్బడోస్ జెండాతో ఉన్న ‘ట్రూ కాన్ఫిడెన్స్’ అనే వాణిజ్య నౌకపై దాడి
- బ్రిటన్, అమెరికా అధికారుల వెల్లడి
- దాడికి బాధ్యత వహిస్తున్నామని ప్రకటించిన హౌతీ
కాగా ఈ దాడి తమదేనని హౌతీ బాధ్యత వహించింది. యెమెన్‌లోని ఏడెన్ పోర్టుకు 50 నాటికల్ మైళ్ల దూరంలో బార్బడోస్ జెండాతో ఉన్న ‘ట్రూ కాన్ఫిడెన్స్’ షిప్ దగ్ధమైపోయిందని పేర్కొంది. కాగా అమెరికా సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ.. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా హౌతీ రెబల్స్ గతేడాది నవంబర్ నుంచి ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు. బ్రిటన్, అమెరికా దేశాల హౌతీలపై ప్రతీకార దాడులు మొదలు పెట్టాయని అన్నారు.