చంద్రబాబు సవాలును స్వీకరించే ధైర్యం ఉందా జగన్?: దేవినేని ఉమా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబు సవాలును స్వీకరించే ధైర్యం ఉందా జగన్?: దేవినేని ఉమా

Devineni Uma fires on Jagan
  • వివేకాను దారుణంగా హత్య చేసి గుండెపోటు అన్నారని దేవినేని ఫైర్
  • తప్పుడు ప్రచారం చేసి గత ఎన్నికల్లో లబ్ధి పొందారని విమర్శ
  • గొడ్డలి ఎవరిచ్చారని మీ చెల్లెలే అడుగుతోంది జగన్ అని వ్యాఖ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేసి.. గుండెపోటు అని మభ్యపెట్టాలని చూశారని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినప్పటికీ... చివరకు అది గొడ్డలి పోటు అని బయటపడిందని చెప్పారు. తప్పుడు ప్రచారంతో గత ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందారని దుయ్యబట్టారు. తమ మధ్యనే హంతకులు ఉన్నప్పటికీ గుర్తించలేకపోయామని చెప్పారు. బాబాయిని చంపిన గొడ్డలి ఎవరిచ్చారు? అని మీ చెల్లెలు అడుగుతోందని ప్రశ్నించారు. వివేకా కూతురు డాక్టర్ సునీత ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... తన తండ్రిని గొడ్డలితో నరికిన విషయం జగన్ కు ఎలా తెలిసిందని ప్రశ్నించిన సంగతి అందరికీ తెలిషిందే. ఈ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని దేవినేని ప్రశ్నించారు. వివేకా హత్యపై చర్చకు సిద్ధమా అంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు సవాలును స్వీకరించే ధైర్యం ఉందా? అంటూ సీఎం జగన్ కు సవాల్ విసిరారు.
Advertisement
Devineni Uma
Telugudesam
Jagan
YSRCP

More Telugu News