ఏమిటీ క్రేజ్.. కళ్లుచెదిరే రేటు పలుకుతున్న ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ టికెట్ ధరలు
- రీసేల్ ప్లాట్ ఫాంలపై టికెట్లకు భారీ డిమాండ్
- రూ.41 లక్షలు పలుకుతున్న ప్రీమియం టికెట్లు
- గరిష్ఠంగా రూ.1.86 కోట్లు పలుకుతున్న ఒక టికెట్
భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అఫీషియల్ టికెట్లను కొనుగోలు చేసి వాటిని వేరే వారికి భారీ రేటుకు విక్రయిస్తున్నట్టుగా మీడియాలో కతానాలు వస్తున్నాయి. న్యూయార్క్‌లో జరగనున్న మ్యాచ్ టికెట్ అధికారిక ధర 6 డాలర్లుగా ఉంది. భారతీయ కరెన్సీలో ఈ విలువ సుమారు రూ. 497. అయితే వీఐపీలకు సంబంధించిన ప్రీమియం సీట్ల రేట్లు 400 డాలర్లుగా (రూ. 33,148) ఉన్నాయి. కానీ స్టబ్‌హబ్, సీట్గ్రీక్ వంటి రీ-సేల్ ప్లాట్‌ఫామ్స్‌పై టికెట్ రేట్లు భారీగా ఉన్నాయి. 400 డాలర్ల టిక్కెట్లు దాదాపు 40,000 డాలర్లు పలుకుతున్నాయని సమాచారం. భారతీయ కరెన్సీలో ఈ విలువ సుమారు రూ. 33 లక్షలుగా ఉంది. ఈ రేటుకు ట్యాక్సులను కూడా జోడిస్తే ధర రూ. 41 లక్షలుగా ఉందని కథనాలు పేర్కొంటున్నాయి.
సీట్‌గీక్ వెబ్‌సైట్‌పై ఒక టికెట్‌ను అత్యధికంగా 1,75,000 డాలర్లకు (సుమారు రూ. 1.4 కోట్లు) అమ్మకానికి ఉంచినట్టు యూఎస్ఏ టుడే తెలిపింది. అదనంగా ట్యాక్సులను కలిపితే ఈ టికెట్ రేటు రూ. 1.86 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.