పవన్ కల్యాణ్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఏపీ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. చిత్తూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను కలిశారు. హైదరాబాదులో పవన్ ను కలిసిన ఆరణి శ్రీనివాసులు తన భవితవ్యంపై చర్చించారు. నియోజకవర్గాల ఇన్చార్జిలను బదిలీ చేస్తున్న వైసీపీ అగ్రనాయకత్వం చిత్తూరు అసెంబ్లీ స్థానానికి విజయానందరెడ్డిని ఇన్చార్జిగా నియమించింది. ఈ నియామకంపై సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆరణి త్వరలోనే జనసేన పార్టీలోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.