డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన టీమిండియా
- తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా గెలవడంతో పాయింట్ల పట్టికలో మారిన సమీకరణాలు
- 65.58 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన భారత్
- 2, 3 స్థానాల్లో నిలిచిన కివీస్, ఆసీస్ జట్లు
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక
1. ఇండియా - 64.58 పాయింట్లు
2. న్యూజిలాండ్ - 60.00 పాయింట్లు
3. ఆస్ట్రేలియా- 59.09 పాయింట్లు
4. బంగ్లాదేశ్ - 50 పాయింట్లు
5. పాకిస్థాన్ - 36.66 పాయింట్లు
6. వెస్టిండీస్ - 33.33 పాయింట్లు
కాగా వెల్లింగ్‌టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా విజయం 172 పరుగులతో తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కామెరాన్ గ్రీన్ అజేయంగా 174 పరుగులతో పాటు బౌలింగ్‌లో నాథన్ లియాన్ రాణించడంతో ఆసీస్ సునాయాసంగా విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.