అది దెయ్యాల కొంప: దూసుకుపోతున్న 'వళరి' ట్రైలర్
- రితికా సింగ్ ప్రధానమైన పాత్రగా 'వళరి'
- హారర్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన కథ
- ఉత్కంఠను పెంచుతున్న ట్రైలర్
- ఈ నెల 6 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్
అది వెంకటాపురం బంగ్లా .. ఆ బంగ్లాలో దెయ్యాలు ఉన్నాయని ఊళ్లో వాళ్లంతా చెప్పుకుంటూ ఉంటారు. ఆ బంగ్లాలోకి ఒక ఫ్యామిలీ దిగుతుంది. అప్పటి నుంచి ఆ ఫ్యామిలీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే ఆసక్తిని రేకెత్తించే సన్నివేశాలపై ట్రైలర్ ను కట్ చేశారు. నిన్న రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.
ఆల్రెడీ శ్రీరామ్ రీసెంటుగా చేసిన 'పిండం' సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఉంది. ఇక రితికా సింగ్ కూడా 'శివలింగ' వంటి హారర్ సినిమాలు చేసింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా రూపొందింది. హత్యలు చేసినవారు ఆ విషయాన్ని మరిచిపోతే, హత్యకి గురైనవారు ఆ వ్యక్తిని మరిచిపోతారా? అనే ఒక ఆసక్తికరమైన అంశంతో ఈ సినిమా నిర్మితమైంది. ప్రాచీన కాలానికి చెందిన 'వళరి' అనే ఆయుధంతో, ఈ హారర్ స్టోరీ ముడిపడి ఉండటం మరో విశేషం.