ఉష్ణోగ్రత మరో 3 డిగ్రీలు పెరిగితే.. 90 శాతం హిమాలయ ప్రాంతాల్లో ఏడాదిపాటు కరవు!
- ఇంగ్లండ్‌లోని ఈస్ట్ అంగ్లియా యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి
- అధ్యయన వివరాలను ప్రచురించిన క్లైమేట్ చేంజ్ జర్నల్
- పారిస్ ఒప్పంద లక్ష్యాలకు అనుగుణంగా నడుచుకుంటే దేశంలోని 80 శాతం జనాభా సేఫ్
ఇండియా, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఘనాపై దృష్టిసారించిన 8 అధ్యయనాల సమాహారం.. భూతాపం వల్ల కరవు, వరదలు, పంట దిగుబడి క్షీణత, జీవ వైవిధ్యం తదితర నష్టాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతాయని అంచనా వేసింది. భూగోళం వేడెక్కడాన్ని 1.5 డిగ్రీలకు పరిమితం చేయడం వల్ల దేశంలోని సగం మంది జీవవైవిధ్యానికి ఆశ్రయంగా పనిచేయవచ్చని తెలిపింది.