మహారాష్ట్ర ప్రతిపక్ష పార్టీల్లో కొలిక్కి వచ్చిన సీట్ల పంపకం.. కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటే..!
- మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు
- 20 స్థానాల్లో ఉద్ధవ్ శివసేన, 18 స్థానాల్లో కాంగ్రెస్, 10 స్థానాల్లో ఎన్సీపీ పోటీ
- తన షేర్ నుంచి వీబీఏకు రెండు స్థానాలు ఇవ్వనున్న శివసేన
- ఇండిపెండెంట్ అభ్యర్థి రాజుశెట్టికి ఒక స్థానం ఇవ్వనున్న ఎన్సీపీ
ప్రాంతీయ పార్టీలైన వంచిత్ బహుజన్ అఘాడీ (వీబీఏ) తో శివసేన (యూబీటీ) రెండు స్థానాలు స్థానాలు పంచుకోనుండగా, పవార్ షేర్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి రాజు శెట్టి పోటీ చేయనున్నారు. ఇక, ముంబైలోని ఆరు లోక్‌సభ స్థానాల్లో సేన (యూబీటీ) నాలుగింటిలో బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ముంబై నార్త్‌ఈస్ట్ సీటును వీబీఏకు ఇచ్చే అవకాశముంది.