కేసీఆర్‌కు కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి బహిరంగ లేఖ
- కృష్ణా జలాల విషయంలో తప్పు చేయలేదనే ధైర్యం ఉంటే మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని సవాల్
- రాజకీయ పునర్జన్మనిచ్చిన మహబూబ్ నగర్ ప్రజలను కేసీఆర్ నిలువునా మోసం చేశారని ఆరోపణ
- కృష్ణా జలాల్లో తెలంగాణకు కేటాయించిన నీటిని కేసీఆర్ ప్రభుత్వం వాడుకోలేదని విమర్శ
కృష్ణా జలాల్లో తెలంగాణకు కేటాయించిన నీటిని కేసీఆర్ ప్రభుత్వం వాడుకోలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ అసమర్థ పాలన వల్ల కృష్ణా నీటి వాటాలో మనకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం పాలమూరు, మేడిగడ్డను బొందపెట్టిందన్నారు. మరోసారి ప్రజలను మోసం చేయడానికే బీఆర్ఎస్ నాయకులు మేడిగడ్డ పర్యటన అంటున్నారని ధ్వజమెత్తారు. రేపు సాయంత్రం పాలమూరులో బీఆర్ఎస్ బండారం బయటపెడతామని హెచ్చరించారు.