Narendra Modi: తెలంగాణలో మోదీ రెండు రోజుల పర్యటన.. 17 సీట్లు గెలవడమే లక్ష్యం

  • మార్చి 4, 5 తేదీల్లో మోదీ పర్యటన
  • ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్న మోదీ
  • 4వ తేదీ రాత్రి రాజ్ భవన్ లో బస
PM Modi 2 days Telangana tour schedule

పార్లమెంటు ఎన్నికల్లో 370 సీట్లను బీజేపీ గెలుస్తుందని ప్రధాని మోదీ లోక్ సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే టార్గెట్ తో బీజేపీ లోక్ సభ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. తెలంగాణలో సైతం మొత్తం 17 సీట్లను కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించబోతున్నారు. మార్చి 4, 5 తేదీల్లో రెండు రోజులపాటు ఆయన పర్యటన కొనసాగనుంది. ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో మోదీ పర్యటిస్తారు. వాస్తవానికి మార్చి 4వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. అయితే మోదీ పర్యటన నేపథ్యంలో ఆయన పర్యటన రద్దయింది. 

మోదీ పర్యటన వివరాలు:

  • మార్చి 4న ఆదిలాబాద్ జిల్లాలో పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఆదిలాబాద్ లో బహిరంగసభ. 
  • మార్చి 4 రాత్రి హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో బస.
  • మార్చి 5న సంగారెడ్డి జిల్లాలో పర్యటన. సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఆ తర్వాత బహిరంగసభ. అనంతరం ఢిల్లీకి తిరుగుపయనం.

More Telugu News