హామీలు అమలు చేయకుంటే కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుంది: ఈటల రాజేందర్
- రూ.34 వేల కోట్ల రుణమాఫీ ఎలా చేస్తారో చెప్పాలని ఈటల రాజేందర్ నిలదీత
- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉండాలి... కానీ ఆటో డ్రైవర్లకు సాయం అందించాలని డిమాండ్
- మోదీ ప్రభుత్వం ఇస్తోన్న ఆయుష్మాన్ భారత్‌ను వినియోగించుకోవాలని సూచన
పేదలకు వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా రూ.10 లక్షల వైద్య బీమా ఇస్తోందని... దీనిని వినియోగించుకోవాలని సూచించారు. తెలంగాణ వచ్చినప్పుడు మద్యం ఆదాయం రూ.10,700 కోట్లుగా ఉండేదని, కానీ ఇప్పుడు రూ.45వేల కోట్లకు చేరుకుందన్నారు. మహిళల బాగు కోసం బెల్ట్ దుకాణాలను మూసివేయాలని సూచించారు.
కేసీఆర్ లక్ష కోట్ల రుణమాఫీ చేయలేకపోయారని, ఇక రేవంత్ లక్షన్నర ఎలా చేస్తారని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గోల్ మాల్ చేస్తారన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. మోదీ ప్రభుత్వం వచ్చాక సరిహద్దుల్లో ఆర్మీ ప్రశాంతంగా ఉంటోందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మతకల్లోలాలు జరుగుతాయని ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.