Chicken: భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కొనలేం బాబోయ్ అంటున్న సామాన్యులు!

  • పెరుగుతున్న ఎండలు, మేడారం జాతర ఎఫెక్ట్
  • సరఫరా తగ్గి, డిమాండ్ పెరగడంతో చికెన్ ధరలకు రెక్కలు
  • హైదరాబాద్ లో కిలో స్కిన్ లెస్ చికెన్ ధర రూ. 300
Chicket rates raised in Hyderabad

చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్. హైదరాబాద్ లో చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఈ నెల 10వ తేదీ వరకు స్కిన్ లెస్ చికెన్ కిలో ధర రూ. 180 నుంచి రూ. 200 వరకు ఉంది. లైవ్ కోడి ధర రూ. 120 నుంచి రూ. 160 మధ్య ఉంది. అయితే పెరుగుతున్న ఎండలతో పాటు ఇటీవల జరిగిన మేడారం జాతర నేపథ్యంలో కోళ్ల సరఫరా తగ్గిపోయింది. డిమాండ్ పెరగడంతో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. స్కిన్ లెస్ చికెన్ ధర రూ. 280 నుంచి 300 వరకు పెరిగింది. కిలో లైవ్ కోడి ధర కూడా రూ. 180 వరకు చేరుకుంది. పెరిగిన ధరలతో చికెన్ కొనేందుకు చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. 

గత నాలుగు రోజులుగా సాధారణ అమ్మకాలతో పోలిస్తే చికెన్ అమ్మకాలు 40 శాతం పడిపోయాయి. హైదరాబాద్ లో సగటున ప్రతి రోజు 12 వేల టన్నుల చికెన్ అమ్మకాలు జరుగుతాయి. గత ఆదివారం హోల్ సేల్, రిటైల్ కలిపి కేవలం 6 వేల టన్నుల విక్రయాలు మాత్రమే జరిగాయి. ఎండాకాలం ముగిసిన తర్వాతే చికెన్ ధరలు మళ్లీ అందుబాటులోకి వస్తాయని వ్యాపారులు చెపుతున్నారు.

More Telugu News