విశాఖలో నిన్న ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్.. ఒక్క రోజులోనే తెగిపోయింది!
- నిన్న బ్రిడ్జిని ప్రారంభించిన వైవీ సుబ్బారెడ్డి
- వంతెన చివరి భాగం తెగిపోయి కొట్టుకుపోయిన వైనం
- రెండో రోజే బ్రిడ్జి తెగిపోవడంతో వెల్లువెత్తుతున్న విమర్శలు
ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ చేపట్టింది. జనవరి మొదటి వారంలో పనులను చేపట్టి చాలా వేగంగా పూర్తి చేశారు. రూ. 1.60 కోట్లతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. రెండో రోజే బ్రిడ్జ్ తెగిపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాద సమయంలో అక్కడున్న సందర్శకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.