నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in losses
  • 352 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 90 పాయింట్లు పతనమైన నిప్టీ
  • 4 శాతం వరకు నష్టపోయిన ఏసియన్ పెయింట్ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. ఆసియా పసిఫిక్ మార్కెట్లలోని ప్రతికూలతలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 352 పాయింట్లు నష్టపోయి 72,790కి పడిపోయింది. నిఫ్టీ 90 పాయింట్లు పతనమై 22,122 వద్ద స్థిరపడింది. టెక్, ఐటీ, మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సూచీలు ఒక శాతానికి పైగా నష్టపోయాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (2.36%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (2.04%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.38%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.10%). 

టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్ (-3.90%), టాటా స్టీల్ (-1.99%), టెక్ మహీంద్రా (-1.99%), టైటాన్ (-1.95%), భారతి ఎయిర్ టెల్ (-1.46%).   

Go Back to Shorts
Stock Market
Sensex
Nifty

More Telugu News