హైదరాబాద్ సిటీ పార్కుల్లో షీ టీమ్స్ నిఘా

She Team Police Checking In City Parks
  • అనైతిక చర్యలకు పాల్పడుతున్న జంటలకు కౌన్సిలింగ్
  • శుక్రవారం 12 మందిని పట్టుకుని ఫైన్ వేసిన పోలీసులు
  • బహిరంగ ప్రదేశాల్లో డీసెంట్ గా ఉండాలని హితవు
పార్కులు, బహిరంగ ప్రదేశాలలో అనైతిక చర్యలకు పాల్పడితే ఉపేక్షించబోమని హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. నగరంలోని పార్కులలో షీ టీమ్స్ నిఘా ఉంటుందని చెప్పారు. జంటగా పార్కులకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. శుక్రవారం నగరంలోని వివిధ పార్కుల్లో ఈమేరకు తనిఖీ చేసిన షీ టీమ్స్ బృందాలు.. 12 మందిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చాయి.

ఇందిరా పార్క్, నెక్లెస్ రోడ్, కృష్ణకాంత్ పార్క్ సహా పలు పార్కులు, ఇతరత్రా పబ్లిక్ ప్లేసులలో అనైతిక చర్యలకు పాల్పడుతున్న జంటలకు షీ టీమ్ పోలీసులు జరిమానా విధించారు. ఆయా పార్కుల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించ వద్దని, డీసెంట్ గా ఉండాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో సామాన్యులకు ఇబ్బందులు కలిగేలా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Go Back to Shorts
Hyderabad Parks
She Teams
Love birds
Councelling
Police Warning

More Telugu News