ఇవాళో, రేపో వైసీపీకి రాజీనామా చేస్తా: రఘురామకృష్ణరాజు

  • వైసీపీ నుంచి తప్పుకునేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్న రఘురామ
  • కూటమి తరఫున మళ్లీ పోటీ చేస్తానని వెల్లడి
  • ఏ పార్టీ నుంచి పోటీ చేసేది త్వరలో ప్రకటిస్తానని వివరణ
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు ముహూర్తం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇవాళ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళో, రేపో వైసీపీకి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. కూటమి తరఫున ఎంపీగా మళ్లీ పోటీ చేస్తానని, అయితే ఏ పార్టీ నుంచి బరిలో దిగుతాననేది త్వరలోనే ప్రకటిస్తానని రఘురామ వివరించారు. అంతేకాదు, ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో జరిగే టీడీపీ-జనసేన భారీ బహిరంగ సభకు హాజరవుతానని తెలిపారు. 

2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున లోక్ సభ సభ్యుడిగా గెలిచిన రఘురామకృష్ణరాజు కాలక్రమంలో పార్టీకి దూరమయ్యారు. పార్టీ అధినాయకత్వంపైనే యుద్ధం ప్రకటించిన ఆయన... విపక్షాలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు.

Raghu Rama Krishna Raju
YSRCP
Resignation
Narsapur
Andhra Pradesh

More Telugu News