నిన్ను ప్రశ్శించిందని సొంత చెల్లిని కూడా అరెస్ట్ చేయించేంత వరకు వెళ్లావు: సీఎం జగన్ పై ధూళిపాళ్ల విమర్శలు

Dhulipalla slams CM Jagan over Sharmila arrest
  • మెగా డీఎస్సీ డిమాండ్ తో ఛలో సెక్రటేరియట్ చేపట్టిన ఏపీ కాంగ్రెస్
  • షర్మిల తదితరులను అరెస్ట్ చేసిన పోలీసులు
  • సీఎం జగన్ ను తప్పుబట్టిన ధూళిపాళ్ల
  • నీ కుటుంబానికి ఎంత ద్రోహం చేశావో అర్థమవుతోందంటూ వ్యాఖ్యలు  
మెగా డీఎస్సీ కోరుతూ ఏపీ కాంగ్రెస్ నేతలు చేపట్టిన ఛలో సెక్రటేరియట్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను అరెస్ట్ చేశారు. దీనిపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ స్పందించారు. సీఎం జగన్ తీరును తప్పుబట్టారు. 

నిన్ను ప్రశ్నించిన వాళ్లందరినీ అరెస్ట్ చేయించుకుంటూ పోతున్న నువ్వు చివరికి నీ సొంత చెల్లిని కూడా అరెస్ట్ చేయించావు అంటూ ధ్వజమెత్తారు. అధికారం కోసం ఈ రాష్ట్రానికి, నీ కుటుంబానికి ఎంతటి నమ్మకద్రోహం చేశావో దీన్ని బట్టే అర్థమవుతోందని ధూళిపాళ్ల విమర్శించారు. నిన్ను, నీ నయవంచక పాలనను బంగాళాఖాతంలో కలిపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు షర్మిల అరెస్ట్ వీడియోను కూడా ధూళిపాళ్ల సోషల్  మీడియాలో పంచుకున్నారు.
Go Back to Shorts
Dhulipala Narendra Kumar
Jagan
Sharmila
Arrest
Chalo Secretariat
Mega DSC
TDP
Congress
YSRCP

More Telugu News