కడప ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ను కలిసిన వివేకా కుమార్తె డాక్టర్ సునీత

Dr Suneetha and her husband met Kadapa SP
  • వివేకా హత్య కేసులో న్యాయపోరాటం చేస్తున్న కుమార్తె డాక్టర్ సునీత
  • బెదిరింపులను ఎదుర్కొంటున్న వైనం
  • నేడు భర్తతో కలిసి కడప జిల్లా ఎస్పీ కార్యాలయానికి రాక
మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి నేడు కడప జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ను కలిసి పలు అంశాలపై మాట్లాడారు. ఎస్పీకి వివేకా హత్య కేసు వివరాలను తెలిపారు. తన భద్రతకు సంబంధించిన అంశాలపైనా సునీత ఎస్పీతో చర్చించారు.

ఎస్పీతో సునీత దంపతుల సమావేశం గంటపాటు సాగింది. వివేకా హత్యకేసులో ఇబ్బందులను వివరించారు. వివేకా పీఏ తమపై అనవసరంగా కేసులు పెట్టారని ఎస్పీకి తెలిపారు. వైసీపీ నేత వర్రా రవీందర్ రెడ్డి తీరును కూడా డాక్టర్ సునీత ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. వర్రా రవీందర్ రెడ్డి పెట్టిన అసభ్య పోస్టుల గురించి వివరించారు.

కడప ఎస్పీని సునీత దంపతులు కలవడం ఇది రెండోసారి. గతేడాది నవంబరులోనూ వారు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ను కలిసి వివేకా హత్య కేసుపై చర్చించారు. అప్పట్లో సిద్ధార్థ్ కౌశల్ కడప జిల్లాకు బదిలీ అయ్యారు.
Go Back to Shorts
YS Vivekananda Reddy
Dr Suneetha
Kadapa SP

More Telugu News