ఐదేళ్ల లోపు పిల్లల కోసం ‘బ్లూ ఆధార్’.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..!
- తల్లిదండ్రుల ఆధార్ తో అనుసంధానం
- స్కూల్ అడ్మిషన్ కు తప్పనిసరి
- ఐదేళ్లు నిండాకే బయోమెట్రిక్ అప్ డేట్
బ్లూ ఆధార్ కోసం ఇలా దరఖాస్తు చేసుకోవాలి..
- ఆధార్ అధికారిక వెబ్ సైట్ లోకి లాగిన్ అయి మై ఆధార్ లో అపాయింట్ మెంట్ బుక్ చేసుకోవాలి.
- చైల్డ్ ఆధార్ లోకి వెళ్లి న్యూ ఆధార్ పై క్లిక్ చేయాలి.
- మొబైల్ నంబర్, వన్ టైమ్ పాస్ వర్డ్ తో కన్ఫార్మ్ చేసుకోవాలి.
- ఐదేళ్ల లోపు చిన్నారి పేరు, పేరెంట్స్ వివరాలు, డేటాఫ్ బర్త్, తల్లిదండ్రుల చిరునామా నమోదు చేయాలి.
- దగ్గర్లోని ఆధార్ సేవా కేంద్రంలో అపాయింట్ మెంట్ తీసుకోవాలి. నిర్ణీత సమయానికి ఆ సేవా కేంద్రానికి వెళ్లి బ్లూ ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి. చిన్నారుల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, మీ ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లడం మర్చిపోవద్దు. వారం పది రోజుల్లో మీ పిల్లల బ్లూ ఆధార్ కార్డు పోస్టులో మీ ఇంటికి చేరుతుంది.
- చిన్నారులకు ఐదేళ్లు నిండాక బయోమెట్రిక్ అప్ డేట్ చేయాల్సి ఉంటుంది.