అంగరంగ వైభవంగా జరిగిన రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి
- ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లాడిన రకుల్
- గోవాలో జరిగిన వివాహం
- హాజరైన బాలీవుడ్, టాలీవుడ్ తారలు
తన ప్రేమ విషయాన్ని 2021లో రకుల్ బయటపెట్టింది. అప్పటి నుంచి వీరు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు తన భర్తతో కలిసి రకుల్ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోంది.
సినిమాల విషయానికి వస్తే... రకుల్ ప్రస్తుతం 'ఇండియన్ 2' సినిమా చేస్తోంది. జాకీ విషయానికి వస్తే... ఆయన నిర్మించిన 'బడే మియా చోటే మియా' ఈ ఈద్ కు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.