మళ్లీ వైసీపీ గూటికి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే.. విజయసాయిరెడ్డి సుదీర్ఘ మంతనాలు?
- నేడు తన సోదరుడు అయోధ్య రామిరెడ్డితో కలిసి జగన్ ను కలుస్తున్న ఆర్కే
- మంగళగిరిలో లోకేశ్ ను ఓడించడమే వైసీపీ లక్ష్యం
- ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన ఆర్కే
మంగళగిరి నుంచి ఆర్కే 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. 2019లో నారా లోకేశ్ ను ఓడించారు. రెండోసారి జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు స్థానం కల్పించకపోవడంతో... ఆయన అప్పటి నుంచే అసంతృప్తితో ఉన్నారు. ఆ తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జీగా గంజి చిరంజీవిని నియమించడంతో మనస్తాపానికి గురైన ఆర్కే తన ఎమ్మెల్యే పదవికి, వైసీపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం వైఎస్ షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు.