శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బెదిరింపులు... నిందితుడి అరెస్ట్
- విమానాల్లో హైజాకర్లు ఉన్నారంటూ ఈ-మెయిల్స్
- బెంగళూరుకు చెందిన వైభవ్ తివారీని నిందితుడిగా గుర్తించిన పోలీసులు
- ఉద్యోగం పోయిందన్న డిప్రెషన్ లో ఈ-మెయిల్స్ పంపాడని వెల్లడి
దీనిపై కేసు నమోదు చేసుకున్న ఎయిర్ పోర్టు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెంగళూరుకు చెందిన వైభవ్ తివారీయే ఈ నకిలీ బెదిరింపులకు పాల్పడ్డాడని గుర్తించి, అతడిని అరెస్ట్ చేశారు. కరోనా సంక్షోభం సమయంలో ఉద్యోగం నుంచి తీసేయడంతో, డిప్రెషన్ కు లోనైన తివారీ ఈ విధంగా నకిలీ బెదిరింపు ఈ-మెయిల్స్ పంపినట్టు పోలీసులు వెల్లడించారు.