మేడారం వెళ్లే బస్సుల్లో కోళ్లు, గొర్రెలు, మేకలకు అవకాశం లేదు: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్
- ఆర్టీసీ బస్సుల్లో మూగజీవాలను తీసుకు రాకుండా భక్తులు సహకరించాలని కోరిన సజ్జనార్
- ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడి
- ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని సూచన
గతంలో ఎప్పుడూలేని విధంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని మేడారంలో 15 కిలో మీటర్ల మేర 48 క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మేడారం జాతరలో 15వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికుల పట్ల సేవాభావంతో వ్యవహరించాలని సూచించారు.