కల్యాణ వైభోగమే... కుమారుడి పెళ్లి ఫొటోలు పంచుకున్న షర్మిల

YS Sharmila shares his son wedding pics
  • షర్మిల తనయుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి వివాహం
  • రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో ఘనంగా పరిణయ మహోత్సవం
  • హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వివాహం
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తనయుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి వివాహం రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో ఘనంగా జరిగింది. రాజారెడ్డి-ప్రియా పెళ్లి వేడుక హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వేర్వేరుగా నిర్వహించారు. కాగా, షర్మిల తన కుమారుడి కల్యాణ వైభోగానికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తలంబ్రాలు వేడుక ఫొటోలను, ఇతర ఫొటోలను ఎక్స్ లో పోస్టు చేశారు.
Go Back to Shorts
YS Sharmila
Raja Reddy
Priya Atluri
Wedding
Jodhpur
Rajasthan
Congress
Andhra Pradesh

More Telugu News