ఢిల్లీ మద్యం కేసు: కవిత పిటిషన్‌పై విచారణ మళ్లీ వాయిదా

SC postponed arguments kavitha petition
  • 28న పిటిషన్‌పై విచారణను చేపడతామన్న సుప్రీం కోర్టు
  • గతంలో నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ పిటిషన్లను జత చేసిన సుప్రీం కోర్టు
  • ప్రస్తుతం మూడు పిటిషన్లపై వేర్వేరుగా విచారణ చేపట్టనున్న న్యాయస్థానం  
ఢిల్లీ మద్యం కేసులో తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై విచారణను 28న చేపడతామని సుప్రీం కోర్టు తెలిపింది. కాగా గతంలో కవిత పిటిషన్‌ను సుప్రీం కోర్టు నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ పిటిషన్లకు జత చేసింది. ప్రస్తుతం మూడు పిటిషన్లపై వేర్వేరుగా విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. మూడు వేర్వేరు కేసులను కలిపి విచారణ చేయడం సబబు కాదని అభిప్రాయపడింది.
Go Back to Shorts
K Kavitha
BRS
Delhi Liquor Scam

More Telugu News