క్రికెట్ గ్రౌండ్‌కు అడ్డంగా ఉన్నాయని 40 చెట్ల నరికివేత.. వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
- జేఎన్టీయూ-కూకట్పల్లి ఫ్లైవోవర్ నిర్మాణం సందర్భంగా 100 చెట్ల తొలగింపు
- వాటిని మణికొండ శ్మశాన వాటిక, క్రికెట్ గ్రౌండ్ వద్ద నాటిన వాటా ఫౌండేషన్
- వాటిలో 40 చెట్ల నరికివేత
- తమకు చెబితే వేరే చోటికి తరలించేవారమంటూ హైకోర్టులో పిల్
- విచారణ మార్చి 6కు వాయిదా
చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె. అనిల్ కుమార్ బెంచ్ ఈ పిటిషన్ ను నిన్న విచారించింది. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం చెట్ల నరికివేతపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులైన అటవీశాఖ ముఖ్య కార్యదర్శి, అటవీశాఖ ముఖ్య సంరక్షణాధికారి, బల్దియా కమిషనర్, మణికొండ మున్సిపల్ కమిషనర్, పురపాలక శాఖ డైరెక్టర్ ఫల్గుణ కుమార్, మణికొండ మాజీ సర్పంచ్ కె.నరేందర్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 6కు వాయిదా వేసింది.