Sonia Gandhi: రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన సోనియా గాంధీ

  • రాజస్థాన్‌లో జరగనున్న మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకదానిని కాంగ్రెస్ సునాయాసంగా గెలుచుకునే అవకాశం
  • నామినేషన్ దాఖలు సమయంలో సోనియా గాంధీ వెంట రాహుల్, ప్రియాంక, అశోక్ గెహ్లాట్
  • తొలిసారి రాజ్యసభ బరిలో నిలిచిన ఏఐసీసీ అగ్రనాయకురాలు
Sonia Gandhi files nomination for Rajya Sabha from Rajasthan

ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ బుధవారం రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. సోనియా ఎన్నిక కావడానికి కావాల్సిన పూర్తి బలం రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆమె నామినేషన్ దాఖలు సమయంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అశోక్ గెహ్లాట్, గోవింద సింగ్ దోస్తాలు ఉన్నారు. ఐదుసార్లు లోక్ సభ కు ఎన్నికైన సోనియా గాంధీ తొలిసారి రాజ్యసభకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

రాజస్థాన్‌లో జరగనున్న మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకదానిని కాంగ్రెస్ సునాయాసంగా గెలుచుకుంటుంది. రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 15 కాగా, 27న ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయ్యాక సోనియా గాంధీ 1999లో తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. నాడు అమేథి, బళ్లారి లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేసి రెండింటా గెలిచారు. 2004 నుంచి ఆమె రాయ్‌బరేలి నుంచి పోటీ చేస్తున్నారు.

More Telugu News