"ట్వంటీ ట్వంటీ ఫోర్... జగనన్న వన్స్ మోర్" అంటూ రోజా కబడ్డీ కూత... వీడియో ఇదిగో!

  • ఆడుదాం ఆంధ్రా క్రీడల్లో మంత్రి రోజా ఉత్సాహం
  • కబడ్డీ బరిలో దిగిన వైనం
  • ఓ రైడర్ ను క్యాచ్ పట్టిన రోజా
  • కాలెత్తి లెగ్ టచ్ కోసం ప్రయత్నం
ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాకు సీఎం జగన్ అంటే ఎంతటి అభిమానమో తెలిసిందే. సీఎం జగన్ కు వైసీపీలో వీర విధేయురాలిగా రోజా గుర్తింపు పొందారు. దాదాపు ప్రతి సందర్భంలోనూ సీఎం జగన్ పట్ల విధేయత ప్రదర్శించేందుకు రోజా ప్రయత్నిస్తుంటారు. 

తాజాగా ఆడుదాం ఆంధ్రా కబడ్డీ పోటీల సందర్భంగా రోజా మరోసారి జగన్ పై అభిమానాన్ని చాటుకున్నారు. కబడ్డీ బరిలో దిగిన మంత్రి రోజా... "కబడ్డీ, కబడ్డీ" అని కూత పెట్టేందుకు బదులుగా "ట్వంటీ ట్వంటీ ఫోర్ (2024)... జగనన్న వన్స్ మోర్" అంటూ కూత పెట్టారు. అనంతరం, కూతకు వచ్చిన ప్రత్యర్థి రైడర్ ను క్యాచ్ పట్టి మురిసిపోయారు. 

మధ్యలో ఓసారి వెనక్కి తిరిగి కాలెత్తి లెగ్ టచ్ కోసం ప్రయత్నం చేశారు. దాంతో ఆ కబడ్డీ మ్యాచ్ చూస్తున్న వారు అరుపులు, కేకలతో రోజాను అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Roja
Kabaddi
2024 Jagananna Once More
Adudam Andhra

More Telugu News