హైదరాబాద్ ను మరి కొంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి: వైవీ సుబ్బారెడ్డి
- 2014లో రాష్ట్ర విభజన
- పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్
- హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా గడువు పొడిగించాలని వైవీ సుబ్బారెడ్డి ఆకాంక్ష
- రాష్ట్రానికి మేలు జరుగుతుందని వెల్లడి
రాష్ట్ర్రానికి మేలు జరగాలంటే హైదరాబాద్ నగరం మరి కొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలనేది తమ ఆలోచన అని పేర్కొన్నారు. విశాఖ రాజధాని కార్యసాధన పూర్తయ్యే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగితేనే బాగుంటుందని వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయపడ్డారు.
ఎన్నికలు ముగిశాక సీఎం, వైసీపీ నాయకత్వం దీనిపై చర్చిస్తారని వెల్లడించారు. రాజధాని కట్టకుండా ఐదేళ్ల పాటు తాత్కాలికం పేరుతో టీడీపీ కాలయాపన చేసిందని విమర్శించారు.