క్యాడ్ బరీ చాక్లెట్ లో పురుగు.. హైదరాబాద్ లో ఘటన.. వీడియో ఇదిగో!
- అమీర్ పేట మెట్రో స్టేషన్ లోని షాపులో కొనుగోలు
- చాక్లెట్ లో పురుగును చూసి వీడియో తీసిన కస్టమర్
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో.. స్పందించిన కంపెనీ
హైదరాబాద్ కు చెందిన రాబిన్ జాకెస్ అనే వ్యక్తి శుక్రవారం మెట్రోలో ఇంటికి తిరిగివెళ్తూ పిల్లల కోసమని ఓ చాక్లెట్ కొనుగోలు చేశాడు. అమీర్ పేట మెట్రో స్టేషన్ లోని ఓ రిటైల్ షాపులో క్యాడ్ బరీ చాక్లెట్ తీసుకున్నాడు. తీరా ఇంటికి వెళ్లి కవర్ ఓపెన్ చేసి చూడగా.. చాక్లెట్ పై పురుగు కనిపించింది. అదీ కూడా కదలుతుండడంతో రాబిన్ ఆశ్చర్యపోయాడు. వెంటనే మొబైల్ ఫోన్ తో వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఎక్స్ పైరీ గడువు ముగిసిన చాక్లెట్ ను అమ్ముతూ వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కాగా, ఈ ట్వీట్ కు నెటిజన్లతో పాటు జీహెచ్ ఎంసీ అధికారులు, క్యాడ్ బరీ డైరీ మిల్క్ కంపెనీ కూడా స్పందించాయి. తగిన చర్యలు తీసుకుంటామంటూ ట్వీట్ చేశాయి.