Niostem: బట్టతలకు చెక్ పెట్టే స్మార్ట్ డివైజ్.. ఆస్ట్రియా కంపెనీ తయారీ

  • నెత్తికి హెల్మెట్‌లా పెట్టుకునే పరికరాన్ని విడుదల చేసిన నియోస్టెమ్
  • తలపై రోజూ అరగంట పాటు పెట్టుకుంటే జుట్టు రాలడం తగ్గుతుందని వెల్లడి
  • వెంట్రుక కుదుళ్లను ప్రేరేపించి బట్టతలను అరికడుతుందని వివరణ
Austrian firm niostem lauches wearable device that cures baldness in men

ఆస్ట్రియాకు చెందిన నియోస్టెమ్ సంస్థ.. బట్టతలకు చెక్ పెట్టే ఓ స్మార్ట్ డివైజ్‌ను తాజాగా విడుదల చేసింది. నెత్తిపై హెల్మెట్‌లా ధరించే ఈ పరికరం.. వెంట్రుకల కుదుళ్లను ప్రేరేపించి జట్టు రాలడం తగ్గిస్తుందని, బట్టతలను నివారిస్తుందని సంస్థ పేర్కొంది. ‘హెయిర్‌లాస్ ప్రివెన్షన్ వెయిరబుల్‌’ పేరిట దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేసింది.

కంపెనీ ప్రకటన ప్రకారం, రోజూ అర్ధగంట దీన్ని తలకు పెట్టుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు లేని చోట మళ్లీ వెంట్రుకలు మొలుస్తాయి. ఈ పరికరంతో ఎటువంటి దుష్ఫలితాలు ఉండవని కూడా సంస్థ హామీ ఇచ్చింది. దీని ధర రూ. 74,735 అని పేర్కొంది. ఆరు నెలల్లోనే సమస్య పరిష్కారమవుతుందని పేర్కొంది.

More Telugu News