కటింగ్ షాపులో కాల్పులు.. ఇద్దరు కస్టమర్ల మృతి!
- న్యూఢిల్లీలోని నజాఫ్‌గఢ్ ప్రాంతంలోని హెయిర్ కటింగ్ సెలూన్‌లో ఘటన
- ఇద్దరు వ్యక్తులపై పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తలపై పలుమార్లు కాల్పులు
- వదిలిపెట్టమని బాధితులు వేడుకున్నా కనికరించని వైనం
- నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాల గాలింపు
షాపులో అందరూ చూస్తుండగానే దుండగులు ఆ ఇద్దరినీ కాల్చి చంపారని స్థానిక పోలీసులు తెలిపారు. మృతులను సోసూ, ఆశిష్‌గా గుర్తించారు. వారికి నిందితులతో వ్యక్తిగత వైరం ఏదైనా ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. గ్యాంగ్‌వార్‌లో భాగంగా ఈ ఘటన జరిగి ఉండొచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాగా, నిందితుల ఆచూకీ కనుక్కునేందుకు మూడు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.