Jeevitha: 34 ఏళ్ల తర్వాత రజనీకాంత్ 'లాల్ సలామ్' చిత్రంతో మళ్లీ వెండితెరపై కనిపించిన జీవిత

Jeevitha appears on screen after 34 years
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ నటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్ సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై కనిపించారు. రజనీకాంత్ ముఖ్యపాత్రలో ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'లాల్ సలామ్' చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో జీవిత కూడా నటించారు. 1990లో జీవిత తన భర్త రాజశేఖర్ హీరోగా వచ్చిన 'మగాడు' చిత్రంలో చివరిసారిగా నటించారు. మళ్లీ 34 ఏళ్ల తర్వాత 'లాల్ సలామ్' చిత్రంతో కెమెరా ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో జీవిత నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ బహుభాషా చిత్రంలో జీవిత పాత్రకు తమిళంలో సరిత డబ్బింగ్ చెప్పారు. దుబాయ్ లో ఉంటున్న సరిత అక్కడ్నించే డబ్బింగ్ చెప్పడం విశేషం.
Go Back to Shorts
Jeevitha
Lal Salaam
Rajinikanth
Tollywood
Kollywood

More Telugu News